థైరాయిడ్ సమస్య ఉన్నవారు సిరిధాన్యాలు, కషాయాలు, చెక్క గానుగ నూనెల సహాయం తో నివారణ చేసుకొనే మార్గాలు: డాక్టర్ ఖాదర్ సూచనలు
ఈ క్రింద చెప్పిన విధం గా 4 నుండి 5 నెలలు పాటిస్తే నివారణ సాధ్యమౌతుంది.
a ) సిరిధాన్యాల ను ఈ విధంగా వాడుకోవాలి :

సామెల బియ్యం : 3 రోజుల పాటు వరుసగా.
అరికెల బియ్యం : ఒక రోజు
ఊదల బియ్యం : ఒక రోజు
కొర్ర బియ్యం : ఒక రోజు
అండు కొర్ర బియ్యం : ఒక రోజు
ఈ 7 రోజుల సిరి ధాన్యాల ఆవర్తనాన్ని ఒక చక్రం లా పదే పదే తిరిగి పాటించాలి.

(ఒక రోజుకు ఒకే ధాన్యాన్ని బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలకు వాడాలనే ముఖ్య సూత్రాన్ని మరిచి పో కూడదు.)

బి) 'చెక్క గానుగ లో తీసిన శుద్ధమైన నూనె' లు కూడా థైరాయిడ్ వ్యాధుల నివారణ లో ఉపకరిస్తాయి.
కొబ్బరి నూనె
వేరు శనగ నూనె
నువ్వుల నూనె
కుసుమ నూనె
వాడే విధానం : ఒక నూనె ను ఒక వారం పాటు సేవించాలి. ఉదయాన్నే 2 చెంచాల నూనె ను సేవించాలి . అటు పై 30 నిమిషాల గడువు తరువాతే కాషాయాలు త్రాగాలి .
ఒక వారం పాటు రోజూ ఒక నూనె ను సేవించాక, నూనె మార్చాలి.
ఇలా నూనెలు సేవించే ఆవర్తనాన్ని ఒక చక్రం లా పడే పడే పాటించాలి.
(4 నూనెలూ దొరకని వారు 2 నూనెలతో కూడా ఈ పద్దతి పాటించవచ్చు. కానీ వాటిలో కొబ్బరి నూనె ఖచ్చితం గా ఉండేలా చూసుకోవాలి)

సి) కషాయాలు : బొప్పాయి ఆకు, తమలపాకు, కొత్తిమీర, పుదీనా, మునగ పూలు : ఒక్కొక్క వారం పాటు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లలో, ఖాళీ కడుపు మీద వీటి కషాయాలు సేవించాలి. వారానికి ఒకటి చొప్పున మార్చుకోవాలి.
( కషాయం : గ్లాసున్నర నీటి లో 6 -7 ఆకులను/గుప్పెడు పూలను చిన్న ముక్కలుగా చేసుకుని 4 నిమిషాలపాటు ఉడికించి, గోరువెచ్చగా, వడకట్టుకుని త్రాగాలి. అవసరమనుకుంటే, శుద్ధమైన తాటి బెల్లపు లేత పాకం చేసుకుని 2-3 చుక్కలు కషాయాలకు కలుపుకోవచ్చు )
ఈ కషాయాల ఆవర్తనాన్ని ఒక చక్రం లా పదే పదే పాటించాలి.

రోజూ 75 నిమిషాల నడక ను మరువకండి. రకరకాల కూరగాయలు, ఆకు కూరలు తినండి.
పైన చెప్పిన విధానాలను శ్రద్ధ గా పాటించి ఆరోగ్యాన్ని పొందండి. ఈ విజ్ఞానాన్ని నలుగురికీ పంచండి.

సంపూర్ణ ఆరోగ్యానికి సిరి ధాన్యాలు (5 మిల్లెట్ లు) !
ఆధునిక రోగాలను సిరి ధాన్యాల తో రూపు మాపుదాం !!